Home Ministry sounds alert on LAC Tension: న్యూఢిల్లీ: సరిహద్దు వెంబడి మళ్లీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజుల క్రితం చైనా సైన్యం భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడంతో మన సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏల్ఏసీ వెంబడి చైనాతో ( India vs China) ఉద్రిక్తత పరిస్థితులు నిత్యం పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ ( Home Ministry ) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇండో-చైనా, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల్లో, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో భద్రతా బలగాలన్నీ అనుక్షణం అలర్ట్‌గా ఉండాలని హోం శాఖ ఆదేశించింది. దీంతోపాటు చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో నిఘా, పెట్రోలింగ్ పెంచాలని ఐటీబీపీ, ఎస్ఎస్బీకు హోంశాఖ ఆదేశాలిచ్చింది. Also read: India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నింగ్
భద్రతా అధికారులతో చర్చలు జరుగుతుండగానే.. తుర్పు లడఖ్‌లో మంగళవారం మరోసారి చైనా ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో బుధవారం హోంమంత్రిత్వ శాఖ భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ మేరకు ఇండో, నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలను సైతం పంపించింది. జమ్మూకశ్మీర్, ఢిల్లీలో ఉన్న వారిని ఇండో చైనా సరిహద్దుకు తరలించారు. దీంతోపాటు పర్వత శ్రేణుల పైన ఉన్న దళాలు వెనక్కి రావద్దని, మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు సైతం ఇచ్చినట్లు భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. Also read: Ladakh: ఇండియన్ ఆర్మీకు పినాకా రాకెట్ లాంచర్లు..చొరబాట్లకు ఇక చెల్లుచీటి