Galwan valley: నాటి ఘటనలో మరణించిన చైనా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా

Galwan valley: ఇండియా చైనాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచిన ఘటన తూర్పు లఢాఖ్ సంఘటన. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఘటనలో చైనాకు అంత భారీ దెబ్బ తగిలిందా..అవునంటోంది ఆ న్యూస్ ఏజెన్సీ.  

Last Updated : Feb 11, 2021, 09:52 PM IST
Galwan valley: నాటి ఘటనలో మరణించిన చైనా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా

Galwan valley: ఇండియా చైనాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచిన ఘటన తూర్పు లఢాఖ్ సంఘటన. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఘటనలో చైనాకు అంత భారీ దెబ్బ తగిలిందా..అవునంటోంది ఆ న్యూస్ ఏజెన్సీ.

తూర్పు లడాఖ్‌ ( East ladakh )లోని గల్వాన్ లోయ ( Galwan valley )లో 2020 జూన్ 15న ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ( Colonel santhosh babu )సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఎల్ఏసీ ( LAC ) వద్ద భారత ఆధీనంలో ఉన్న ప్రాంతాల్ని ఆక్రమించేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించి సమయంలో ఆ ఘర్షణ జరిగింది. అప్పట్లో చైనాకు కూడా ప్రాణనష్టం వాటిల్లిందనే వార్తలొచ్చాయి గానీ..చైనా ఈ విషయాన్ని ఇప్పటివరకూ ధృవీకరించేదు. ఈ ఘర్షణ అనంతరం భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు ( Indo china dispute ) తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది.

ఇప్పుడీ ఘటనపై రష్యన్ న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ ( Russian news agency TASS ) సంచలన విషయాలు వెల్లడించింది. అప్పుడు జరిగిన ఘర్షణలో చైనాకు భారీగా ప్రాణనష్టం ఏర్పడిందని తెలిపింది. చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్టు రష్యన్ వార్తా సంస్థ ప్రకటించింది. 

Also read: Koo app security threat: కూ యాప్ ఎంతవరకూ సురక్షితం, చైనా పెట్టుబడులు, డేటా లీక్ వార్తలతో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News