DK Shivakumar: తెలంగాణ ఎన్నికల ముందు అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు డీకే శివకుమార్. చేరికల నుంచి టికెట్ల వరకు తన చుట్టే రాజకీయాన్ని తిప్పుకున్నారు. పక్క రాష్ట్రమైనా తెలంగాణ నేతలకన్నా చాలా పవర్ ఫుల్ గా మారారు. ప్రస్తుతం మాత్రం అతను సైలెంట్ అయిపోయారు. అతను తనకు తానే సైడ్ అయ్యారా.. ? ఎవరైనా సైడ్ చేశారా.. ?
DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Lok sabha Elections 2024: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్, పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటకలో బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతోందని అన్నారు. ఇది కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మీ హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి.
BJP-JDS Alliance: 2024 ఎన్నికల వేళ బీజేపీ కొత్త మిత్రుల్ని వెతుకుతోంది. దక్షిణాదిన బలపడేందుకు ప్రాంతీయ పార్టీలతో కొత్తు పొత్తుల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటక రూపంలో కొత్త పొత్తు పొడిచింది. ఆ వివరాలు మీ కోసం..
Karnataka Politics: కర్ణాటక చిక్కుముడి తొలగింది. ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో అధిష్టానం తేల్చేసింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే డీకేకు ముఖ్యమంత్రి అవకాశం పోయినట్టేనా లేదా ఇంకా మిగిలుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
Karnataka Politics: ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వద్దనుకున్నారు. పాలించమని పగ్గాలు చేతికిచ్చారు. అయినా సీఎం ఎవర్ని నియమించాలనే పంచాయితీ తెగడం లేదు ఆ పార్టీలో. ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది బీజేపీ.
Karnataka Politics: ఒకే ఒక్క కులంతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా అంటే ఎందుకు కాదనే సత్యం బోధపడుతుంది. మతం, కులం ఎక్కడా కూడు పెట్టకపోయినా రాజకీయాల్లో మాత్రం పెడుతుందని అర్ధమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
Karnataka: కర్నాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోస్టర్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకటి పోస్టర్లతో దాడులు చేస్తున్నాయి. పేసీఎం అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన చేపట్టింది.
Congress MLA Sensational Allegations on Karnataka Govt: కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) రిక్రూట్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. మొత్తం 1492 అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 600 పోస్టులు ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు.
Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన కేబినెట్ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు.
CM Basavaraj Bommai praises BS Yediyurappa: బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రజారంజకమైన పరిపాలన అందించారని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. అందుకే తాను కూడా యడియూరప్ప అడుగుజాడల్లోనే నడవనున్నట్టు బసవరాజ్ తెలిపారు.
Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం (Basavaraj Bommai's oath taking ceremony) జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Karnataka new CM Basavaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపి ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బసవరాజు బొమ్మై బీజేపి (BJP) అధిష్టానం ఆహ్వానంతో 2008లో బీజేపీలో చేరారు.
Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Karnataka CM BS Yediyurappa's resignation: బెంగళూరు: కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప రాజీనామాపై ఉత్కంఠ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టమైన ప్రకటన చేశారు. జూలై 26 సోమవారంతో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో వార్షికోత్సవంలో యడ్యూరప్ప పాల్గొని మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.
Karnataka: కర్నాటకలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. బీజేపీ నాయకత్వమార్పు ఉంటుందా లేదా అనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్సెస్ వ్యతిరేకవర్గం మధ్య వాగ్వాదం పెరుగుతోంది.
Karnataka BJP demands D K Shivakumar's resignation: బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేష్ జర్కిహోలికి సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియోలో కనిపించిన మహిళ తన కుటుంబంతో ఫోన్లో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికే శివకుమార్‌ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పిన ఆడియో టేప్ (Audio tapes leaked) బయటికి లీక్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.