Karnataka Politics: కర్ణాటక చిక్కుముడి ఎలా వీడింది, అసలేం జరిగింది..డీకేకు ఇంకా ఛాన్స్ ఉన్నట్టేనా

Karnataka Politics: కర్ణాటక చిక్కుముడి తొలగింది. ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో అధిష్టానం తేల్చేసింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే డీకేకు ముఖ్యమంత్రి అవకాశం పోయినట్టేనా లేదా ఇంకా మిగిలుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2023, 03:04 PM IST
Karnataka Politics: కర్ణాటక చిక్కుముడి ఎలా వీడింది, అసలేం జరిగింది..డీకేకు ఇంకా ఛాన్స్ ఉన్నట్టేనా

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్‌కు అఖండ విజయం అందించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి డీకే శివకుమార్. 135 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా మాత్రం మరోసారి సిద్ధరామయ్యనే ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరి డీకే పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి అవకాశం ఉందా లేదా అంటే ఇంకా మిగిలుందనే సమాధానం వస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారాన్ని కోల్పోయిన బీజేపీ 66 సీట్లతో సరిపెట్టుకోగా జనతాదళ్ ఎస్ 19 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించడంలో అధిష్టానం ఇచ్చిన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన డీకేకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే అంతా ఆశించారు. కానీ సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ పోటీలో అధిష్టానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపింది. రేపు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంటే ఇక డీకే శివకుమార్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేనట్టేనని కొందరంటుంటే..ఇంకా ఆ అవకాశాలు పూర్తిగా ఉన్నాయంటున్నారు మరి కొందరు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయించినప్పుడు డీకేను ఎలా ఒప్పించిందనేది తెలిస్తే అసలు విషయం అర్ధమౌతుంది. డీకేకు ఇంకా ముఖ్యమంత్రి అవకాశాలున్నాయనే విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. 

కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆ పార్టీ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ ఫార్ములా రూపొందించారు. అదే పవర్ షేరింగ్ ఫార్ములా. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం లేదా ఒకరు రెండేళ్లు, మరొకరు మూడేళ్లు ఉండటం జరుగుతుంది. ఈ ఫార్ములా వల్లనే డీకే సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా అంగీకరించారని తెలుస్తోంది. పైకి మాత్రం ఏ విధమైన పవర్ షేరింగ్ ఒప్పందాలు జరగలేదని చెబుతున్నా..లోపల అంతర్గతంగా జరిగింది మాత్రం ఇదే. 

డీకే, సిద్ధ రామయ్య మధ్య అంతర్గతంగా జరిగింది ఇదే

మొదటి పర్యాయం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిలో రేసులో ఉంటారు. ఈలోగా 2024 పార్లమెంట్ ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘన  విజయం అందించాల్సిన బాధ్యత డీకేది. అప్పటి వరకూ ఆయనే పీసీసీ ఛీప్‌గా కొనసాగుతారు. ఉప ముఖ్యమంత్రితో పాటు ఆరు పోర్ట్ ఫోలియోలు కూడా కేటాయిస్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఇప్పటిలానే ఘన విజయాన్ని చేకూరిస్తే అప్పట్నించి మిగిలిన కాలానికి లేదా రెండున్నరేళ్ల కాలానికి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారు. ఈ ఒప్పందానికి డీకే శివకుమార్ సైతం అంగీకరించినట్టు సమాచారం. 

బహుశా అందుకే డీకే శివకుమార్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పవర్ షేరింగ్ జరగలేదని మాత్రం చెప్పలేదు. పవర్ షేరింగ్ ఫార్ములాను నెను వెల్లడించలేనని, అందరూ కలిసి జరిపిన చర్చల్ని బహిర్గతం చేయదల్చుకోలేదని తెలిపారు. ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడే దీనిపై సమాధానమిస్తారని డీకే శివకుమార్ చెప్పారు. ప్రస్తుతానికి తానేమీ బాధపడటం లేదని ప్రయాణం ఇంకా మిగిలుందని కూడా స్పష్టం చేశారు. కేవలం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీ పడ్డానన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తమ నిబద్ధతను నిరూపించుకోవల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మరో ఏడాది వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికలున్నందున అధిష్టానం నిర్ణయానికి తలవంచాల్సిందేనన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనల్ని అంగీకరిస్తున్నానన్నారు. 

డీకే వ్యాఖ్యల్ని బట్టి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయన్నించి ఇంకా దూరం కాలేదనే తెలుస్తోంది. ఇంకా ఆ అవకాశం మిగిలే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి డీకే శివకుమార్ భవిష్యత్ ముఖ్యమంత్రి కావడం లేదా కాకపోవడమనేది ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్ని దక్కించుకోగా, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానం గెల్చుకుంది. అందుకే ఈసారి డీకేకు పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.

Also read: Karnataka: రేపే కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం, ఎవరెవరికి ఆహ్వానం, ఎవరికి నో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News