Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. కర్ణాటక రాజకీయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. తాను పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వెళ్తున్నట్టు తెలిపారు.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా (Karnataka new CM) ఎవరి పేరును ప్రకటించే అవకాశం ఉంది అని పాత్రికేయులు ప్రశ్నించగా.. ప్రస్తుతానికి ఆ వివరాలు ఏవీ తనకు తెలియదని, ఎమ్మెల్యేలు సమావేశమై తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంటారని అన్నారు.
I will go to Bengaluru, a meeting will be held with all MLAs, things will be decided there: Union Minister & Observer for Karnataka G Kishan Reddy
"I don't know. MLAs will decide," Union Minister G Kishan Reddy when asked if there is any expected name for Karnataka CM. pic.twitter.com/YruI2ijEad
— ANI (@ANI) July 27, 2021
Also read : Vat on Fuel : ఇంధన ధరలపై వ్యాట్ ఎక్కువ ఆ రెండు రాష్ట్రాల్లోనే
ఇదిలావుంటే, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ (Sadananda Gowda) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త సీఎం ఎంపికలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్ (Lingayat), దళిత సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. మరి బీజేపీ అధిష్టానం (BJP) ఎవరి పేరును ప్రకటిస్తుందనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
Also read: Karnataka CM BS Yediyurappa: యడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో వేడెక్కిన కర్ణాటక రాజకీయం