ఉత్కంఠ పరిణామాల మధ్య బలపరీక్ష నెగ్గిన యడియూరప్ప !!

కర్నాటక లో  బీజేపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.

Last Updated : Jul 29, 2019, 12:30 PM IST
ఉత్కంఠ పరిణామాల మధ్య బలపరీక్ష నెగ్గిన యడియూరప్ప !!

కర్నాటకలో పరిపాలించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని అసెంబ్లీలో  ఈ రోజు ముఖ్యమంత్రి యడియూరప్ప నిరూపించుకున్నారు. ఉత్కంఠ పరిమాణామాల మధ్య సాగిన బలపరీక్షలో యడ్డీ సర్కార్ కు అనుకూలంగా 106 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మేజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అధికంగా పడటంతో విశ్వాస పరీక్షలో సీఎం యాడియూరప్ప గట్టేక్కినట్లయింది

ఉత్కంఠ రేపిన స్పీకర్ చర్య
బలపరీక్షకు ముందు స్పీకర్ రమేష్ కుమార్ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 రెబల్ మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలతో ఈజీగా గట్టేక్కానుకున్న యాడియూరప్ప సర్కార్ కు షాక్ తగితలింది. ఈజీగా గట్టేక్కాల్సిన అంశం కాస్త ఉత్కంఠంగా మారింది. ఈ పరిణామంతో బలపరీక్ష నెగ్గాలంటే మేజిక్ ఫిగర్ 104 కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి అసెంబ్లీలో 105 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఏమాత్రం చిన్నపాటి లెక్కతప్పినా ప్రభుత్వ మనుగుడ ముప్పు పొంచి ఉందని గ్రహించిన సీఎం  యాడియూరప్ప ...తమ పార్టీకి చెందిన సభ్యులు సభకు తప్పకుండా హాజరుకావాలని విప్ జారీ చేశారు. బీజేపీ సభ్యులందరూ సభకు హాజరుకావడంతో బీజేపీ ప్రభుత్వం ఈజీగా గట్టేకేసింది. దీంతో యూడియూరప్పతో పాటు బీజేపీ పెద్దలు  ఊరిపి పీల్చుకున్నారు.

స్వాగతించిన ప్రతిపక్షాలు

విశ్వాసపరీక్షలో యడియూరప్ప విజయం సాధించడంతో విపక్షాలు తమ ఓటమిని అంగీకరించాయి.రాష్ట్రంలో పరిపాలన చేసేందుకు యాడియూరప్ప సర్కార్ ను ఆహ్వానించారు.  యడియూరప్ప సర్కార్ ప్రజల ఆంక్షలను నెరవేర్చే దిశగా  పని చేయాలని ప్రతిపక్షంలో కూర్చున్న జేడీఎల్పీ నేత, మాజీ సీఎం  కుమారస్వామి సీఎల్పీ నేత సిద్ధరామయ్య కోరారు. కాగా బీజేపీ ప్రభుత్వం కొనసాగేందకు లైన్ క్లియర్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.
 

Trending News