మహిళలు పడక పంచుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటకలో ఇదీ పరిస్థితి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Congress MLA Sensational Allegations on Karnataka Govt: కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్)  రిక్రూట్‌మెంట్‌లో భారీ స్కామ్ జరిగిందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. మొత్తం 1492 అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 600 పోస్టులు ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 13, 2022, 12:27 PM IST
  • కర్ణాటక ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
  • ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించిన ప్రియాంక్ ఖర్గే
  • రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్
మహిళలు పడక పంచుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటకలో ఇదీ పరిస్థితి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Congress MLA Sensational Allegations on Karnataka Govt: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పురుషులు లంచాలు.. మహిళలైతే శరీరాలను సమర్పించుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ స్కామ్స్‌పై న్యాయ విచారణ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు.

'కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగాలన్నీ అమ్ముకోవాలని నిర్ణయించుకుంది. యువతులు తమకు జాబ్ కావాలంటే ఎవరో ఒకరితో పడక పంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. పురుషులైతే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒక మంత్రి ఉద్యోగం కోసం ఒక యువతిని తనతో పడక పంచుకోవాలని కోరాడు. ఆ రాసలీలు వెలుగుచూడగానే పదవికి రాజీనామా చేశారు. నా మాటలకు ఇదే ప్రూఫ్..' అని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.

కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్)  రిక్రూట్‌మెంట్‌లో భారీ స్కామ్ జరిగిందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. మొత్తం 1492 అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 600 పోస్టులు ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. ఏఈ పోస్టులకు రూ.50 లక్షలు, జేఈ పోస్టులకు రూ.30 లక్షలు చొప్పున ప్రభుత్వం అభ్యర్థుల నుంచి వసూలు చేసిందన్నారు. గోకక్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో కేపీటీసీఎల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి బ్లూటూత్‌తో దొరికిపోయాడని అన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు.

ఇలా ప్రతీ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలను అమ్ముకుంటే ప్రతిభ కలిగిన నిరుపేద అభ్యర్థుల సంగతేంటని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ఇలాంటి స్కామ్స్ వెలుగుచూసినా తమకేమీ కాదనే భరోసాతో వాటి సూత్రధారులు ఉంటున్నారని ఆరోపించారు. కర్ణాటక యువత భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

Also Read: Munugode Byelection: రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముందు కలకలం..  రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు

Also Read: Telangana SI Jobs: తెలంగాణ ఎస్ఐ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 8 మార్కులు కలపాలని నిర్ణయించిన రిక్రూట్‌మెంట్ బోర్డు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News