జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి, హింస ఘటనల అనంతరం బాధిత విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ దీపికా పదుకునె ఇటీవల జేఎన్యూకు వెళ్లడం ఎంత చర్చనియాంశమైందో అందరికీ తెలిసిందే. జేఎన్‌యూలో దాడి వెనుక ఎవరున్నారనే చర్చల నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఆ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి వారిని పరామర్శించడం పతాకశీర్షికలకెక్కింది.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 20 20 న్యూస్.
గత ఆదివారం యూనివర్సిటీలోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ఘటన తర్వాత వర్సిటీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని వీసీ జగదీష్ కుమార్ తెలిపారు.
జవహార్‌లాల్ నెహ్రూ యూనిర్సిటీలో నెల 4న విద్యార్థులపై జరిగిన కిరాతక దాడికి వ్యతిరేకంగా, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తన మద్దతు ప్రకటించారు. దాడిలో గాయపడిన విద్యార్థుల్ని పరామర్శించిన దీపికా పదుకొనే వారికి ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.
రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దాడికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి సందర్భంగా ఓ విద్యార్థి తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడా వీడియో ఆధారంగా పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు.
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
జేఎన్‌యూలో హింసకు పాల్పడిన అల్లరిమూకలను కేజ్రీవాల్ సర్కార్ వెనకేసుకొస్తోంది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం.. విద్యార్థి సంఘాలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నిరసనలు. గూండాలు యూనివర్శిటీలోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టనట్టే వ్యవహరించారని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు. యూనివర్శిటీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో దృశ్యాల ఆధారంగా విచారణ చేపడతామని స్పష్టంచేసిన పోలీసులు. జేఎన్‌యూలో దాడుల ఘటనపై విచారణ నిమిత్తం మూడు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు.
జేఎన్‌యూ నిరసనల నుంచి మొదలుకుని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూఎస్-ఇరాన్ వార్ వరకు ప్రపంచం నలుమూలలా ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన వార్తాంశాలు క్లుప్తంగా...
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. JNUలో నిన్న రాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. చేతుల్లో కర్రలు, రాడ్లతో లోపలికి వచ్చిన దుండగులు .. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
జేఎన్‌యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్శిటీలో మళ్లీ కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత మళ్లీ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.