న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా ఉద్రిక్త వాతావరణంలో ఉన్న జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ జగదీష్ కుమార్ తెలిపారు. గత ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు గుర్తుతెలియని దుండగులు వర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడటం ఢిల్లీలో కలకలం రేపింది. విద్యార్థులపై దాడి వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే.
Jawaharlal Nehru University VC M Jagadesh Kumar: The situation in university is peaceful & normal. University will continue to function and conduct academic activities. We would like to help every student to continue their academic goals. https://t.co/UVTO1x2Ef2 pic.twitter.com/k283RO5PPR
— ANI (@ANI) January 10, 2020
ప్రస్తుతం జేఎన్‌యూలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రశాంత వాతావరణం నెలకొందని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తరగతులు యాథావిధిగా నిర్వహిస్తామని, అకడమిక్ పనులు సజావుగా సాగేలా చూస్తామన్నారు. ప్రతి విద్యార్థి వారి అకడమిక్ గోల్స్ సాధించేందుకు తాము తోడ్పాడు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకుని కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కాగా, జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి తమ పనేనంటూ హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జాతీయవాదానికి వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయన్న కారణంగానే దాడికి పాల్పడినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పింకీ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
JNUలో పరిస్థితి అదుపులోకి వచ్చింది: వీసీ