/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లోకి కొందరు గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వర్సిటీలోకి గుండాలు ప్రవేశించి విద్యార్థులపై దాడి చేయడాన్ని రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఓ విషయంపై ధైర్యంగా పోరాడుతున్నందుకు విద్యార్థులపై దాడి జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

Also Read: JNU ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం

‘జేఎన్‌యూ విద్యార్థులు దుండగుల దాడికి తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. కానీ నిందితులను వెతికి పట్టుకుని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన కేంద్ర మంత్రులు కేవలం ట్వీట్లు చేయడం దారుణం. పోలీసులు గుండాలతో కలిసి ఎందుకున్నారో మోదీ సర్కార్‌ తప్పనిసరిగా జవాబుచెప్పాలని’ ప్రశ్నిస్తూ అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. బాధిత విద్యార్థుల పక్షాన తాము కూడా పోరాటం చేస్తామని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. గాయపడ్డ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపింది.

కాగా, ఆదివారం రాత్రి జేఎన్‌యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జేఎన్‌యూ విద్యార్థులపై దాడిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం ()కు వ్యతిరేకంగా ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ పోరాటం కొనసాగిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Section: 
English Title: 
MIM leader Asaduddin Owaisi attacks NDA government over JNU incident
News Source: 
Home Title: 

జేఎన్‌యూ ఘటన: మోదీ సర్కార్‌కు అసదుద్దీన్‌ సూటి ప్రశ్న

Asaduddin Owaisi Response over JNU issue: మోదీ సర్కార్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ సూటి ప్రశ్న
Caption: 
నరేంద్ర మోదీ, అసదుద్దీన్‌ ఒవైసీ (ఫైల్‌ ఫొటో)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జేఎన్‌యూ ఘటన: మోదీ సర్కార్‌కు అసదుద్దీన్‌ సూటి ప్రశ్న
Publish Later: 
No
Publish At: 
Monday, January 6, 2020 - 15:13