తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Jagadeesh Reddy: మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Phoenix: ఫీనిక్స్‌లో ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. పూర్తి ఆధారాలతోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫీనిక్స్ చైర్మన్‌తో కేటీఆర్ కు సంబంధాలున్నాయనేది బీజేపీ ఆరోపణ
TARGET KTR: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.ఫీనిక్స్ సంస్థల్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయ సెగలు రేపుతోంది
IT Raids In Hyderabad: హైదరాబాద్ లో భారీగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పలు నిర్మాణాలను ఫీనిక్స్ సంస్థ చేపట్టింది.
IT RAIDS: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి చెందిన 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
IT raids in Hyderabad and AP: రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఏపీలో ఏకకాలంలో పది చోట్ల వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి.
IT Raids on Hero MotoCorp: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్లోని హీరో మోటోకార్ప్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సీఈవో పవన్ ముంజల్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుపుతోంది.
IT raids on Dainik Bhaskar Group offices and promoter's residences: న్యూ ఢిల్లీ: ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్‌కి చెందిన ఆఫీసులు, ప్రమోటర్స్ నివాసాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు (Income tax raids) నిర్వహిస్తోంది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పలు ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేసింది.
Taapsee pannu: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. మూడ్రోజులుగా తన నివాసంపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు. మూడ్రోజుల దాడుల్లో ఏం సోదా చేశారో..ఏం సాధించారో వెల్లడించాలని తాప్పీ ఐటీ అధికారులను కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన చేసినట్టు తెలిపారు. సోదాల్లో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కి చెందిన కార్యాలయాలు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నివాసంతో పాటు ఇతర ప్రదేశాలను కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.