IT raids: రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలు, ఇతర నటులు, నిర్మాతల నివాసాలపై ఐటీ దాడులు

రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కి చెందిన కార్యాలయాలు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నివాసంతో పాటు ఇతర ప్రదేశాలను కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

Last Updated : Nov 20, 2019, 01:22 PM IST
IT raids: రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలు, ఇతర నటులు, నిర్మాతల నివాసాలపై ఐటీ దాడులు

హైదరాబాద్: రామానాయుడు స్టూడియోస్(Ramanaidu studios), ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్(Suresh productions) కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచే రామానాయుడు స్టూడియో, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కి చెందిన కార్యాలయాలు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నివాసంతో పాటు ఇతర ప్రదేశాలను కలిపి మొత్తం 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమలో పేరొందిన దిగ్గజ కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. 

ఇదిలావుంటే, సురేష్ బాబుతోపాటు టాలీవుడ్‌కి చెందిన ఇంకొంత మంది నటులు, నిర్మాతల నివాసాల్లో ఐటి దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఐటి అధికారులు దాడులు జరుపుతున్న ప్రదేశాల్లో న్యాచురల్ స్టార్ నాని నివాసం సైతం ఉన్నట్టు సమాచారం. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కేఎల్ నారాయణ వంటి నిర్మాతలతోపాటు ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై సైతం ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా జరుగుతున్న ఐటి దాడులు పలువురు నిర్మాతలు, నటీనటుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Trending News