చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ ఆకస్మిక తనిఖీలు

ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.

Last Updated : Feb 6, 2020, 01:50 PM IST
చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ ఆకస్మిక తనిఖీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సహాయకుడు (పీఏ)గా వ్యవహరించిన శ్రీనివాస్ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ ఆకస్మిక తనిఖీలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసుల బందోబస్తు నడుమ ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: దేశంలో తొలిసారిగా.. ‘దిశ’ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్

కాగా, శ్రీనివాస్ 2019 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు వద్ద పీఏగా వ్యహరించాడు. ప్రస్తుతం సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. విజయవాడలో, హైదరాబాద్‌లో శ్రీనివాస్ ఇళ్లతో పాటు సమీప బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి 2019 ఎన్నికల వరకు చంద్రబాబుకు ఆయన పీఏగా వ్యవహరించాడు. భారీగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారని సమాచారం.

Read Also: దక్షిణ హైదరాబాద్‌పై ఎందుకీ నిర్లక్ష్యం: అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News