Taapsee pannu: ఐటీ దాడులపై స్పందించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్ను

Taapsee pannu: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. మూడ్రోజులుగా తన నివాసంపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు. మూడ్రోజుల దాడుల్లో ఏం సోదా చేశారో..ఏం సాధించారో వెల్లడించాలని తాప్పీ ఐటీ అధికారులను కోరారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2021, 03:19 PM IST
Taapsee pannu: ఐటీ దాడులపై స్పందించిన బాలీవుడ్ నటి తాప్సీ పన్ను

Taapsee pannu: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. మూడ్రోజులుగా తన నివాసంపై జరుగుతున్న దాడులపై మాట్లాడారు. మూడ్రోజుల దాడుల్లో ఏం సోదా చేశారో..ఏం సాధించారో వెల్లడించాలని తాప్పీ ఐటీ అధికారులను కోరారు.

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (Income tax) అధికారులు బాలీవుడ్ (Bollywood) నటుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ముఖ్యంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్సీతో పాటు మరి కొందరి ఇళ్లపై వరుస దాడులు జరిగాయి. ఇందులో భాగంగా తాప్సీ నివాసంపై మూడ్రోజుల పాటు ఐటీ దాడులు నిర్వహించింది ఈ ఘటనపై మూడ్రోజుల్నించి సోషల్ మీడియా సాక్షిగా పెద్దఎత్తున వార్తలు ట్రోల్ అయ్యాయి. ఈ సోదాలపై ఇప్పుడు తొలిసారిగా బాలీవుడ్ నటి తాప్సీ(Taapsee pannu) స్పందించింది. ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేసింది. 

మూడ్రోజుల్నించి తన నివాసాలపై సోదాలు నిర్వహించిన ఇన్‌కంటాక్స్(Income tax) అధికారులు ఏం సోదా చేశారు, ఏం సాధించారో వెల్లడించాలని తాప్సీ కోరింది. పారిస్‌లో తనకొక బంగ్లా ఉందని చెప్పి..ఆ తాళాల కోసం వెతికారని తెలిపింది. వాస్తవానికి తనకక్కడ ఇళ్లే లేదని స్పష్టం చేసింది. అదే విధంగా ఐదు కోట్లు రూపాయలు తీసుకున్నాననే ఆరోపణలతో ఆ రశీదుల కోసం వెతికారని చెప్పింది. తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదని తెలిపింది. మరోవైపు కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala sitaraman) వ్యాఖ్యలపై కూడా స్పందించింది. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టు 2013లో తన నివాసంపై ఐటీ దాడులు(IT Raids)జరిగినట్టు గుర్తు లేదని ట్విట్టర్‌లో పేర్కొంది. ఎవరిపైనా తాను కామెంట్ చేయాలనుకోవడం లేదంది. నిజంగా అప్పుడు దాడులు జరిగుంటే ఆ సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడెందుకు ఇంత పెద్ద విషయంగా చూస్తున్నారని ప్రశ్నించింది. 

Also read: Maha samudram first look: ఆకట్టుకుంటున్న శర్వానంద్ .మహా మసముద్రం ఫస్ట్‌లుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News