Covid-19 Test in Telangana | తెలంగాణ కోవిడ్-19 టెస్టులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా జరగడం లేదు అని తెలిపింది.
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Hearing on Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు (AP Group-1 Mains Exam Postponed) ఊహించిటనట్లుగానే మరోసారి వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఏపీ గ్రూప్-1 నిర్వహించాల్సి ఉంది.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ అత్యాచార సంఘటనపై ‘దిశా ఎన్కౌంటర్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపాలంటూ.. దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు, దీంతోపాటు మరికొన్ని అంశాలపై చర్చించి చట్టాలు చేయాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తెలంగాణ ప్రభుత్వంపై ( Telangana Govt ) హైకోర్టు ( High Court ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి (CoronaVirus cases in Telangana) నివారణ చర్యలు, కోవిడ్19 పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
TS High Court On Secratariat demolition | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది. సచివాలయ భవనాల కూల్చివేతల్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్‌లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది.
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
TS SSC Board | కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో హై కోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ సర్కార్.. పదో తరగతి పరీక్షలు ( SSC Exams ) రాయకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
TS 10th class exams 2020: హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హై కోర్టు సూచించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
TS SSC exams 2020: హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఓ స్పష్టత వచ్చింది. తెలంగాణలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 8 నుంచి యధావిధిగా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే, జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి జిల్లా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ఆ ప్రాంతాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అంగీకరించలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.