గన్ మెన్ల ఉపసంహరణ అంశంపై హైకోర్టు తీర్పు నాగం జనార్థన్ రెడ్డికి అనకూలంగా వచ్చింది. తనకు గన్ మెన్లను తొలగించిన అంశంపై హైకోర్టులో నాగం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం కావాలనే తన భద్రతను ఉపసంహరించుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
నాగం పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం నాగం తరఫు న్యాయవాది వాదనలను సమర్ధించింది. అంతే కాదు నాగంకు భద్రతను ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) అధ్యక్షడు వివేక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. HCA అధ్యక్ష పదవి విషయంలో సింగల్ జడ్జీ ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు తాజాగా ఆదేశాలతో వివేక్ HCA పదవి మరోమారు కోల్పోయే అవకాశముందని న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.