BRS Social Media Questions To Ponguleti Srinivasa Reddy ED Raids: పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు జరిగి వారాలు గడుస్తున్నా వివరాలు బయటకు రాకపోవడంపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ సందేహాలు లేవనెత్తింది. ఈడీ దాడుల కోసం పొంగులేటి బీజేపీ ముందు మోకరిల్లాడని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి. అంతేకాదు ఈ బృందాలు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ED Raids: మరి కొద్దిరోజుల్లో ఎన్నికలనగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం కావడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Gangula Kamalakar : సీబీఐ నోటీసుల మీద గంగుల కమలాకర్ స్పందించాడు. ఇటీవలె ఓ గెట్ టుగెదర్ పార్టీలో శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆ విషయం మీద నోటీసులు వచ్చాయని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
IT Raids : రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మాల్లారెడ్డి ఇంట్లో గత రెండ్రోజులుగా ఐటీ తనీఖిలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కి చెందిన చార్టెడ్ అకౌంటెంట్‌కి సిబిఐ నోటీసులు జారీ చేసింది. సదరు చార్టెడ్ అకౌంటెంట్ మరెవరో కాదు.. రాబిన్ డిస్టిలరీస్ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా సేవలు అందిస్తున్న గోరంట్ల బుచ్చిబాబే.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ ఢిల్లీ డివ్యూటీ సీఎం సిసోడియా, రామచంద్ర పిళ్లైని కలిపి ప్రశ్నించనుంది సీబీఐ.ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టుతో హైదరాబాద్‌లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Dehi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు
Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసింది. బోయినపల్లి అభిషేక్ రావు గతంలో ఎమ్మెల్సీ కవిత దగ్గర పని చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంలో తెలంగాణ నుంచి తర్వాత ఎవరూ అరెస్ట్ అవుతారన్నది ఆసక్తి గా మారింది.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.మీడియా హౌజ్ తో పాటు అధికార పార్టీ ముఖ్య నేతల సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండటంతో త్వరలోనే కీలక పరిణామాలు జరగనున్నాయనే ప్రచారం సాగుతోంది.
Delhi Excise Policy scam Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేడు ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 35 చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం ఉదయాన్నే ఈడి సోదాలు మొదలుపెట్టింది.
TARGET TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరబాద్ లింకులు బయటపడటం.. సీబీఐ అరెస్టులు మొదలు కావడంతో కొందరు టీఆర్ఎస్ నేతలు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని తెలుస్తోంది. కొందరు నేతలు తమ అనుచరులకు కూడా అందబాటులో లేరట. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే నేత కుటుంబ సభ్యుడిపైనా ఆరోపణలు వస్తుండగా.. సదరు నేత ఫోన్ స్విచ్చాఫ్ అయిందనే వార్తలు వస్తున్నాయి
MP Santosh Rao: సీబీఐ, ఈడీ దాడులకు భయపడి హైదరాబాద్ వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై ఎంపీ సంతోష్ రావు స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన సంతోష్ తనపై కొన్ని రోజులుగా జరగుతున్న ప్రచారం అసత్యమని చెప్పారు.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం జరిగింది. తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.