MP Santosh Rao: సీబీఐ, ఈడీ దాడులకు భయపడి హైదరాబాద్ వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై ఎంపీ సంతోష్ రావు స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన సంతోష్ తనపై కొన్ని రోజులుగా జరగుతున్న ప్రచారం అసత్యమని చెప్పారు. తాను ఎక్కడికి పోలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాన్నారు సంతోష్ రావు. కేసీఆర్ తనను తిట్టారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నాయకుడు, తన జీవితానికి స్ఫూర్తి ప్రధాత, తన బాస్ అయిన సీఎం కేసీఆర్ సేవలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను ప్రగతి భవన్ నుండే మాట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు సంతోష్ రావు.
తాను ఎప్పటికి కేసీఆర్ సేవకుడిగానే ఉంటానని.. దీన్ని ఎవరూ మార్చలేరంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎంపీ సంతోష్. రెండు, మూడు రోజులు బయటికి రాకుంటే అసత్య ప్రచారం చేస్తారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మనిషిని కాదా.. తనకు ఆరోగ్య సమస్యలు ఉండవా అని నిలదీశారు. తానెప్పుడు రాజకీయ నేత అని భావించ లేదని.. కేసీఆర్ కు సేవ చేయడానికే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయ నేతగానే భావించనప్పుడు... పార్టీ కార్యక్రమాలకు దూరమనే ప్రశ్న ఎలా వస్తుందన్నారు సంతోష్ రావు. కేసీఆర్ లేకుంటే తాను జీరో అన్నారు. కేసీఆర్ ఆదేశాలను పాటించడమే తన ఏకైక కర్తవ్యమన్నారు. ఈడీ దాడులపై ప్రశ్నించగా ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని సంతోష్ రావు కామెంట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంతోష్ రావు సన్నిహితులు ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంతోష్ ను సీఎం కేసీఆర్ తిట్టారని.. మనస్తాపంతో సంతోష్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. సంతోష్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ దినపత్రిక కథనానికి సంబంధించిన క్లిప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది ఈ వార్తలు టీఆర్ఎస్ పార్టీలోనూ కలకలం రేపాయి. ఈ వార్తలపైనే తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎంపీ సంతోష్ రావు. తాను ఎక్కడికి వెళ్లలేదని, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నానన్నారు.
Read also: సినిమా సూపరంటూ ఫస్ట్ రివ్యూయర్ హల్చల్.. అసలు నువ్వెవరంటూ షాకిచ్చిన సుహాసిని!
Read also: Supreme Court: భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. అబార్షన్ చట్టబద్దమే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి