Dehi Liqour Scam: లిక్కర్ స్కాంలో సీబీఐ మరో నోటీస్.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?

Dehi Liqour Scam:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు

Written by - Srisailam | Last Updated : Oct 16, 2022, 03:16 PM IST
  • లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు
  • మనీశ్ సోసిడియాకు నోటీసులు
  • లిక్కర్ స్కాంలో కీలక నేత అరెస్ట్?
Dehi Liqour Scam: లిక్కర్ స్కాంలో సీబీఐ మరో నోటీస్.. కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధం?

Dehi Liqour Scam:  దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్టు కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమైందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతూరు, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చిన లిక్కర్ స్కాం కేసులో తాజాగా సీబీఐ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు  సమన్లు జారీ చేసింది. అక్టోబరు 17  సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం సిసోడియా కేంద్రంగానే సాగిందనే ఆరోపణలు ఉన్నాయి.  

తనకు సీబీఐ నోటీసు ఇవ్వడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, దర్యాప్తునకు సహకరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో తన ఇంట్లో 14 గంటలపాటు సీబీఐ సోదాలు జరిపినా అక్కడ వాళ్లకు ఏమి దొరకలేదన్నారు. తన బ్యాంకు లాకర్‌ను ఓపెన్ చేసినా ఏం కనిపించలేదన్నారు సిసోడియా. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్తానని.. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఢిల్లీ డిప్యూటీ సీఎం చెప్పారు.మనీశ్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. సిసోడియాను స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్‌ తో పోల్చుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కటకటాలు, ఉరికంబం భగత్ సింగ్ దృఢ సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయని అన్నారి. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటమని అభివర్ణించారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ తరం భగత్ సింగులని కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ లో పలు సార్లు సీబీఐ, ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా సన్నిహతుడు, ఆప్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ విజయ్ నాయర్‌ను, అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఏ15 నిందితుడిగా ఉన్న లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లై.. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. కవిత ఫ్యామిలీతో కలిసి పిళ్లై తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఇక ఈ కేసులో వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. పలు సార్లు విచారణ తర్వాత బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. వీళ్లద్దరు కవితకు సన్నిహితులే.

ఇక తాము అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్ ను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. కస్టడీ విచారణలో అభిషేక్ ఇచ్చిన వివరాల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కాంలో కేసులో త్వరలోనే కీలక నేత అరెస్ట్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

Read Also: Pawan Kalyan VS Roja: మంత్రి రోజాకు పవన్ కల్యాణ్ కౌంటర్ మాముులుగా లేదుగా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News