ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
Tirupati Lok Sabha: తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో జనసేన మళ్లీ ప్రచారానికే పరిమితం కానుందా..బీజేపీ ఒత్తిడితో ఈసారి కూడా పోటీకు దూరం కానుందా. పరిస్థితి చూస్తే అవుననే అన్పిస్తోంది. రీడ్ ద స్టోరీ..
నువ్వా నేనా రీతిలో సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ( Dubbaka Bypoll Results ) చివరికి బీజేపీవైపు మొగ్గు చూపాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందర్ రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిని సుజాతపై 1118 ఓట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
TRS vs BJP In Dubbaka By Election Results : వరుసగా మూడు రౌండ్లలో అధికార టీఎర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 13, 14, 15 మూడు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్‌గా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా.. వరుసగా మూడు రౌండ్లలో కారు దూసుకెళ్లింది. రౌండ్ రౌండ్లో ఫలితాలు, ఆధిక్యాలు మారిపోతున్నాయి.
Dubbaka Bypoll Results Live Updates | దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఆరో రౌండ్లో టీఆర్ఎస్కు 353 ఓట్ల ఆధిక్యం, ఏడో రౌండ్లో సుజాత రెడ్డికి 182 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే ఇది స్వల్ప ఆధిక్యం కావడంతో 8వ రౌండ్ ఫలితాలో దుబ్బాకలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ వచ్చింది.
Dubbaka Bypoll Results Live Updates | దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి మూడు రౌండ్ల లెక్కింపు అనంతరం దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Dubbaka By Election Counting Begins: దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహా మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నట్టే...ఎన్నికల కమీషన్ సంసిద్ధమవుతోంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Fake Votes Find at Dubbaka Bypolls | కీలక అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి ఓటు వేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నేటి ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
Dubbaka Assembly Bypoll | దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ప్రారంభమైంది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. నవంబర్ 3న జరిగే ఓటర్ల తీర్పు మిగిలింది. చిన్న చిన్న సంఘటనలు మినహా..ప్రచారపర్వం ప్రశాంతంగానే సాగింది. ఏ పార్టీ ధీమా ఎలా ఉందో తెలుసుకుందాం..
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల వేడి నెలకొంది. ప్రచారంలో ప్రాధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటల తూటాలతో విమర్శించుకుంటున్నాయి. మరికొన్నిగంటల్లోనే దుబ్బాక ఎన్నికల (Dubbaka Bypoll) ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (K. T. Rama Rao) ఆసక్తికరమైన ట్విట్ చేశారు.
Dubbaka Bypoll Campaign Ends Today | దుబ్బాక ఉపఎన్నికల మాటల పోరుకు నేడు తెర పడనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు దుబ్బాక ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నికల జరగనుందని తెలిసిందే.
Dubbaka Bypoll TRS candidate Solipeta Sujatha | ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతాన్నారేమోనన్న అనుమానంతో దుబ్బాక ఉప ఎన్నికల అభ్యర్థులపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
Anchor Kathi Kartika in cheating case: హైదరాబాద్: యాంకర్, బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కత్తి కార్తిక గతంలో ఓ భూ వివాదాన్ని సెటిల్ చేస్తానని నమ్మించి తన వద్ద కోటి రూపాయల కాజేసినట్టు ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Dubbaka Bypoll | దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కేటాయించడం తెలిసిందే
దుబ్బాక (Dubbaka Bypoll) ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. తమ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత (Solipeta Sujatha) పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఖరారు చేశారు.
Dubbaka By Election Date | దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ (Dubbaka Bypoll Schedule) ఖరారైంది. ఈ మేరకు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూయడంతో ఈ సీటు ఖాళీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.