Dubbaka Bypoll Schedule: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు

Dubbaka By Election Date | దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ (Dubbaka Bypoll Schedule) ఖరారైంది. ఈ మేరకు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూయడంతో ఈ సీటు ఖాళీ అయింది.

Last Updated : Sep 29, 2020, 04:45 PM IST
Dubbaka Bypoll Schedule: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ (Dubbaka Bypoll Schedule) ఖరారైంది. ఈ మేరకు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka Bypoll on November 3) నిర్వహించనున్నారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ప్రక్రియ, విజేతను ప్రకటిస్తారు.  

దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూయడంతో ఈ సీటు ఖాళీ (Dubbaka By Election Date) అయింది. 25 ఏళ్లపాటు జర్నలిస్టుగా సేవలందించిన రామలింగారెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆగస్టు తొలి వారంలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూయడం తెలిసిందే. 

కాగా, నవంబర్ రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ రెండో వారం తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) జరగనున్నాయి. మరోవైపు అక్టోబర్ 9న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 12న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

 

మరిన్ని ఆసక్తికర కథనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News