Anchor Kathi Kartika in cheating case: హైదరాబాద్: యాంకర్, బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలో ( Dubbaka by election ) ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ ( AIFB) అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కత్తి కార్తిక గతంలో ఓ భూ వివాదాన్ని సెటిల్ చేస్తానని నమ్మించి తన వద్ద కోటి రూపాయల కాజేసినట్టు ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమీన్‌పూర్ సమీపంలో 52 ఎకరాల భూ వివాదంలో కత్తి కార్తీక మధ్యవర్తిత్వం వహించి మోసం చేసినట్టు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ( Banjarahills police station ) దర్యాప్తు చేపట్టారు. Also read : LRS last date in Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
లండన్‌లో ఆర్కిటెక్చర్ కోర్స్ చదువుకున్న కత్తి కార్తీక ఆ తర్వాత తెలంగాణకు తిరిగొచ్చాకా మీడియా రంగంపై ఉన్న ఇష్టంతో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌లో కంటెస్టంట్‌గా పాల్గొని షోలో సందడి చేశారు. ఆ తర్వాత ఇప్పుడిలా దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి మరోసారి జనం ముందుకొచ్చారు. Also read : Uppal MLA Bethi Subhas Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe