Dubbaka Bypoll | దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతాన్నారేమోనన్న అనుమానంతో దుబ్బాక ఉప ఎన్నికల అభ్యర్థులపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత వాహనం వెళ్తుండగా రాయపోల్ మండలం ఆరేపల్లి వద్ద పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా ఎలాంటి నగదు లభ్యం కాలేదు. అనంతరం వాహనాన్ని పోలీసులు పంపించేశారు. టీఆర్ఎస్ నేతలు తనిఖీకి సహకరించారని పోలీసులు తెలిపారు. నగదు లభ్యం కాలేదని, అందుకే వాహనాన్ని వెంటనే వెళ్లేందుకు అనుమతించామని చెప్పారు.
కాగా, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లు, బంధువుల ఇళ్లు, ఆస్తులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు రఘునందన్ రావుకు సంబంధించిన వారి ఇంట్లో నగదు పట్టుబడిందని పోలీసులు చెబుతుండగా.. పోలీసులే ఆ నగదు సంచిలో తీసుకొచ్చారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.
- Also Read : Telangana Covid-19: కొత్తగా 837 కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe