సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
మెల్బోర్న్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. టీ-20 వుమెన్స్ ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి .. నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లారు.
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫుల్లు ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పెనుసవాలుగా మారడంతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ అగ్రభాగాన కొనసాగుతున్నాడు.
మైదానంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఫస్ట్ ఇండియన్ రికార్డు వచ్చిచేరింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే భారీగా ఉంది.
మిస్టల్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని .. ఇప్పుడో.. అప్పుడో .. రిటైర్మెంట్ ప్రకటిస్తారని .. ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా క్రికెట్ మైదానంలో అడుగు పెట్టకపోవడం .. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో .. ధోనీకి ఇక రిటైర్మెంటేననే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.