మిస్టల్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని .. ఇప్పుడో.. అప్పుడో .. రిటైర్మెంట్ ప్రకటిస్తారని .. ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా క్రికెట్ మైదానంలో అడుగు పెట్టకపోవడం .. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో .. ధోనీకి ఇక రిటైర్మెంటేననే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. కానీ కొన్నాళ్ల నుంచి క్రికెట్ మైదానికి దూరంగా ఉన్న ఎంఎస్ ధోనీ ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో సెలవులను సరదా సరదాగా గడిపేస్తున్నాడు ధోనీ. అవును.. ఆయన ఎక్కడ ఉన్నా సందడే కదా.. ! ఇప్పుడు ఆయన మాల్దీవుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోలు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోల్లో భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ .. మిస్టర్ కూల్ గా కనిపిస్తున్నారు. తోటి క్రికెటర్ స్నేహితులకు పానీ పూరీలు తయారు చేస్తూ కనిపిస్తున్నారు.
Straight outta Maldives, our rockstar is seen making a couple of pani puris!👨🍳
Our favorite chat just became even more delectable! 🥰🤤#MahiInMaldives #Dhoni @msdhoni pic.twitter.com/NFjGcuMT1h
— MS Dhoni Fans Official (@msdfansofficial) February 4, 2020
మాల్దీవుల్లో సరదాగా ఉన్న ఎంఎస్ ధోనీకి సంబంధించిన మరో వీడియో ఇది. ఇందులో ధోనీ .. స్నేహితులతో వాలీబాల్ ఆడుతున్నాడు.
.@msdhoni spotted playing Volleyball with friends in Maldives ❤️#MSDhoni #Dhoni pic.twitter.com/RqrdlfeZaY
— Dhoni Raina Team (@dhoniraina_team) February 4, 2020
38 ఏళ్ల ఎంఎస్ ధోనీ ... కొద్ది కాలం నుంచి క్రికెట్ మైదానానికి దూరంగా ఉంటున్నాడు. ఆయన చివరగా ప్రపంచకప్ లో న్యూజీలాండ్ తో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఒక్కటి కూడా ఆడలేదు. ఇటీవల బీసీసీఐ.. ధోనీతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. అప్పటి నుంచి ధోనీ .. రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు దీనిపై వ్యాఖ్యలు చేశారు. కానీ ధోనీ మాత్రం తనదైన శైలిలో కూల్ గానే ఉన్నాడు.