IND vs SL 3rd T20 highlights: శ్రీలంకపై 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.

Last Updated : Jan 11, 2020, 12:10 AM IST
IND vs SL 3rd T20 highlights: శ్రీలంకపై 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

పూణే: భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టీమిండియా 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ వరుసగా తొలి ఆరు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడగొట్టి లంక నడ్డి విరిచారు. ఒకానొక దశలో ఇబ్బందుల్లో పడిన జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ కుదురుగా ఆడుతూ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. శ్రీలంక పరిస్థితి కాస్త మెరుగు పడుతున్నట్టు కనిపిస్తున్న దశలోనే వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్‌లో మ్యాథ్యూస్ (31) మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దాసున్ శంకా (9) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో  అతనికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వానిండు హసరంగాను యుజ్వేంద్ర చాహల్ రనౌట్ చేశాడు. 15వ ఓవర్‌లో సుందర్ వేసిన చివరి బంతికి లక్షన్ సందకన్ (1) కీపర్ సంజూ శాంసన్ చేతికి చిక్కి స్టంప్‌ ఔట్ అయ్యాడు.
 
ఇదిలావుండగా మరోవైపు ధనుంజయ డి సిల్వ మాత్రం తన వికెట్‌ను కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సులతో 57 పరుగులు చేసి లంక జట్టును విజయం దిశగా తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే, నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో ధనుంజయ కూడా బుమ్రా చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. చివర్లో బ్యాటింగ్‌కి దిగిన లసిత్ మలింగ (0) సైనీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

Trending News