ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ని భారత్ కైవసం చేసుకొని మళ్లీ వన్డేల్లో నెంబర్ వన్‌గా నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 243 పరుగుల లక్ష్యాన్ని చేధించడంతో భారత్ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. రోహిత్ శర్మ (125) సెంచరీ భారత్ విజయానికి వెన్నుదన్నుగా నిలవగా ఐదు వన్డేల సిరీస్‌ని 4-1 తేడాతో భారత్ చేజిక్కించుకొని విజయ దుందుభి మోగించింది. రోహిత్ శర్మతో పాటు అజింక్య రహానె (61), రథసారథి విరాట్ కోహ్లి (39) కూడా రాణించడంతో అనుకున్న లక్ష్యాన్ని టీమిండియా 42.5 ఓవర్లలోనే 244/3 స్కోరుతో పూర్తి చేసింది.
వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీసేనకు బ్రేక్ పడింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన lనాల్గో వన్డే క్రికెట్ లో పరాభావం ఎదురైంది. లక్ష్యసాధనకు చేరువైనా 21 పరుగుల తేడాతో టీమిండియా చతికిలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో 334 పరుగులు చేసింది. ఆతర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో 313 పరుగులు చేసింది. తుదివరకు పోరాడినా ఆఖర్లో చతికిలపడింది. జాదవ్, రోహిత్, రహానే అర్థసెంచరీలతో మెరిసిన ఫలితం లేకపోయింది.
టీం ఇండియా మంచి జోషు మీదుంది. వరుసగా తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన భారత జట్టు పదవ వన్డేలో కూడా విజయం సాధిస్తే వరుసగా పది వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా ఘనత సాధించనుంది. భారత వన్డే చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ఇప్పటి వరకు ఈ ఫీట్ ను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ అందుకున్నాయి. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికకానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.