సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఏదో ఒక విధంగా నువ్వు జట్టులో ఉంటే బాగుంటుందనిపిస్తోంది అని రైనాకు చెప్పాడు. '' బౌలింగ్, ఫీల్డింగ్‌లో నీకు మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి నీలో క్రికెట్ టాలెంట్ ఇంకా మిగిలి ఉంది. కాకపోతే మన చేతుల్లో ఏమీ లేదు కదా'' అని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రియుల్లో ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. రోహిత్ శర్మ, సురేష్ రైనా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఈ ఆసక్తికరమైన చర్చ జరిగింది. ( Also read : PM Modi speech highlights : ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు )
అయితే, రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై సురేష్ రైనా సానుకూలంగా స్పందించాడు. టీమిండియా జట్టులో తనకు చోటు లభిస్తుందనే ఆశతోనే ఉన్నట్టు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. తనకు ఓ గాయం కావడం, ఆ తర్వాత ఓ సర్జరీ కూడా జరగడమే టీమిండియాలో తాను చోటు కోల్పోవడానికి పెద్ద కారణమైందని రైనా పేర్కొన్నాడు. తనలో ఇంకా ఎంతో టాలెంట్ మిగిలి ఉందని అభిప్రాయపడిన రైనా.. పర్ ఫార్మెన్స్ ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది కానీ టీమిండియా సెలెక్షన్ కాదు కదా అని బదులిచ్చాడు. ( Also read : Mahesh Babu డైలాగ్‌తో వార్నర్ మళ్లీ సంచలనం! )
తాను క్రికెట్ కెరీర్‌ని ఎంతో ఎంజాయ్ చేశానన్న రైనా.. మనం జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్ద ఆటగాళ్లు మనల్ని బాగా ఎంకరేజ్ చేశారని, అలాంటి మద్దతే ఇప్పుడు కూడా కావాలని రైనా వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా టీమిండియా లెజెండ్, మాజీ కెప్టేన్ ఎంఎస్ ధోనీ పేరు సైతం ప్రస్తావనకు వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఐపిఎల్ 2020 కోసం ధోనీ ప్రాక్టీస్ చేయడం చూశానని చెప్పుకొచ్చిన రైనా.. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ స్టైల్ చాలా బాగుందని.. ఫిట్‌నెస్ కూడా బాగుందని అన్నాడు. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఐపిఎల్ 2020 ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేసుకున్న సురేష్ రైనా.. ఇక ధోనీ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయనేది ఆయనకే తెలియాలన్నాడు. ఏదేమైనా స్కిల్స్ పరంగా మాత్రం ధోనీ ఫిట్‌గా ఉన్నాడని రైనా అభిప్రాయపడ్డాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
సురేష్ రైనా టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు