వైరల్ వీడియో: సచిన్‌తో బాలీవుడ్ స్టార్స్ గల్లీ క్రికెట్

వైరల్ వీడియో: సచిన్‌తో బాలీవుడ్ స్టార్స్ గల్లీ క్రికెట్

Last Updated : Aug 31, 2019, 09:38 PM IST
వైరల్ వీడియో: సచిన్‌తో బాలీవుడ్ స్టార్స్ గల్లీ క్రికెట్

క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్‌తో క‌లిసి గల్లీ క్రికెట్ ఆడే అవకాశం వస్తే, ఆ మజానే వేరు కదా!! అవును బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చ‌న్, వ‌రుణ్ ధావ‌న్‌లకు సరిగ్గా ఆ అవకాశమే వచ్చింది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌చిన్ టెండూల్కర్ షూటింగ్ గ్యాప్‌లో స్టార్స్‌తో క‌లిసి క్రికెట్ ఆడాడు. తొలుత స‌చిన్‌ బ్యాటింగ్ చేయగా వరుణ్ ధావ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ బౌలింగ్ చేశారు. అనంతరం ఓ ఔత్సాహిక మ‌హిళా యువ క్రికెట‌ర్‌తో వ‌రుణ్‌కి సచిన్‌ బౌలింగ్ చేయించాడు. ఆ త‌ర్వాత త‌ను కూడా వరుణ్‌కి బౌలింగ్ చేశాడు.

సరదాగా బాలీవుడ్ స్టార్స్‌తో ఆడిన క్రికెట్ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌ ఖాతా ద్వారా షేర్ చేసిన స‌చిన్.. ప‌నిలో ఆట‌ల‌ని ఓ భాగం చేసుకుంటే బాగుంటుందని సూచించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ సచిన్ టెండుల్కర్ షేర్ చేసుకున్న ఈ వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Trending News