ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా (Suresh Raina).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు.
బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలోని మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. ధోనీ రిటైర్మెంట్పై 2006లో కామెంట్లు చేశాడని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది. క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధోనీ స్వాతంత్ర దినోత్సవం రోజున తన అభిమానులకు షాకిస్తూ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్లో తొలి, చివరి మ్యాచ్‌లలో రనౌట్ (MS Dhoni Run Out) అయిన క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్, భారత అరుదైన క్రికెటర్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారి నుంచి (Karun Nair recoverd from COVID19) కోలుకున్నాడు. ఐపీఎల్ 2020లో కరుణ్ ఆడనున్నట్లు పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఐపీఎల్ దాదాపు ఆరు నెలలు ఆలస్యంగా మొదలవుతోంది. యూఏఈ వేదికగా నిర్వహించనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ తేదీ (IPL 2020 Final Date)ని భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో కూర్చుకున్న క్రికెట్ ప్రేమికులు కనీసం IPL 2020 అయినా జరిగింటే రెండు నెలల వినోదం దొరికేదని భావించారు. ఆ కోరిక ఎట్టకేలకు యూఏఈలో తీరనుంది.
IPL 2020కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో BCCI తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Happy Birthday Sunil Gavaskar | సునీల్ గవాస్కర్ నేడు 71వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సునీల్ గవాస్కర్ పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెటర్లు, ఆయన అభిమానులు లిటిల్ మాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో ఇండియాలో క్రికెట్ తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ
ప్రేమికుల రోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన ఫస్ట్ లవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సచిన్ షేర్ చేసుకున్న ఫస్ట్ లవ్ వీడియోలో అంజలితో లవ్ స్టోరి లేదు. మరి ఆ వీడియోలో ఉంది ఇంకెవరు అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియోను చూసేయండి.
నాలుగు పదుల వయస్సులోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పేసే ఈ రోజుల్లో 96 ఏళ్ళ కురువృద్ధుడు క్రికెట్ ఆడిచూపించాడు.. ఆయితే ఆయనేమైనా క్రికెటరా అంటే అదీకాదు..క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని ఓ ప్రముఖు వ్యక్తి. ఎలగెలగా ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా ? ఈ వ్యక్తి ఎవరిని తెలుసుకోవాలని ఉందా ? ..అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది..
యువరాజ్ రిటైర్మెంట్ విషయం ప్రస్తుతం చర్చనీయశంగా మారింది. గత ఎనిమిది నెలల నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యూచ్ లోనూ యువరాజ్ ఆడింది లేదు. ఈ నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని పలువురు మాజీలు సలహాలు ఇస్తున్న తరుణంలో యువరాజ్ సింగ్ స్పందించాడు. తను రిటైర్మెంట్ గురించి మీడియాతో మాట్లాడుతూ 2019 ప్రపంచకప్ తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు.
ఐపీఎల్ పైనే దృష్టి..
"విరాట్ కోహ్లీ నిజంగానే జీనియస్. ఆయన ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్" అంటూ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ భారత క్రికెట్ జట్టు రథసారథి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.
బౌలర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా క్రీజులో అడుగుపెట్టిన దగ్గరి నుంచి బాదడమే పనిగా పెట్టుకునే సెహ్వాగ్ కూడా ఓ బౌలర్ అంటే భయపడే వాడట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ అంటే తనకు భయంగా ఉండేదని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవడం కఠిన పరీక్ష లాంటిదని..షాట్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. మురళీ బౌలింగ్ తో పాటు ముఖ కవళికలు కూడా తనను ఎంతగానో భయపెట్టేవన్నాడు. దీంతో కాస్త వత్తిడికి గురయ్యేవాడినని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
భారతదేశంలో చాలావరకు స్టేడియాలు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. అరుదుగా గవాస్కర్, సచిన్, గంగూలీ ఆటగాళ్ల పేర్లమీద స్టేడియాలు ముంబై, కోల్‌కతా నగరాలలో కనిపిస్తాయి. మరి అమెరికాలో మన భారతీయ క్రీడాకారుడి పేరుమీద స్టేడియం ఉంటే ? తన పేరుమీద నిర్మితమైన ఆ స్టేడియాన్ని భారత క్రికెటర్ అక్టోబర్ నెలలో ఆరభించనున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రం కెంటకీలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మితమైన స్టేడియానికి భారత క్రికెటర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట "సునీల్ గవాస్కర్ ఫీల్డ్" అని పేరు పెట్టారు. అమెరికా స్టేడియానికి భారత క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. "కేవలం ఆటగాళ్ల పేర్ల మీదే కాకుండా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.