బౌలర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా క్రీజులో అడుగుపెట్టిన దగ్గరి నుంచి బాదడమే పనిగా పెట్టుకునే సెహ్వాగ్ కూడా ఓ బౌలర్ అంటే భయపడే వాడట. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా వెల్లడించాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ అంటే తనకు భయంగా ఉండేదని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవడం కఠిన పరీక్ష లాంటిదని..షాట్ కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. మురళీ బౌలింగ్ తో పాటు ముఖ కవళికలు కూడా తనను ఎంతగానో భయపెట్టేవన్నాడు. దీంతో కాస్త వత్తిడికి గురయ్యేవాడినని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత్ -ఆసీస్ మధ్య జరుగుతున్న టి 20 మ్యాచ్ కు సెహ్వాగ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెహ్వాగ్ తన మనసులో మాటను ఇలా బయటపెట్టేశాడు. అందరినీ భయపెట్టే సెహ్వాగ్ కూడా ఒక్కడికి భయపడ్డాడనే విషయం తెలిసింది కదూ..