ఐసీసీ ట్యాప్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, బూమ్రా..!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలు మొదటి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Last Updated : Nov 13, 2018, 02:08 PM IST
ఐసీసీ ట్యాప్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, బూమ్రా..!

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలు మొదటి స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే బ్యాట్స్‌మన్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 899 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ (భారత్, 871 పాయింట్లు), రాస్ టేలర్ (న్యూజిలాండ్, 808 పాయింట్లు), జాయ్ రూట్ (ఇంగ్లాండ్, 807 పాయింట్లు), బాబర్ ఆజామ్ (పాకిస్తాన్, 802 పాయింట్లు) మిగతా స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ఆయన తర్వాతి స్థానాలలో రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్, 788 పాయింట్లు), కుల్దీప్ యాదవ్ (భారత్, 723 పాయింట్లు), కగిసో రబడా (దక్షిణాఫ్రికా, 702 పాయింట్లు), యజువేంద్ర చాహల్ (భారత్, 683 పాయింట్లు) కొనసాగుతున్నారు.

ఇక ఆల్ రౌండర్స్ విషయానికి వస్తే తొలిస్థానంలో ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ 353 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆయన తర్వాతి స్థానాల్లో మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్, 337 పాయింట్లు), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్, 332 పాయింట్లు), మహ్మద్ హఫీజ్ (పాకిస్తాన్, 311 పాయింట్లు), మిచెల్ శాంతర్ (న్యూజిలాండ్, 308 పాయింట్లు) ఉన్నారు. 

ఇక వన్డే టీమ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే 6918 పాయింట్లతో, 126 రేటింగ్‌తో ఇంగ్లాండ్ తొలి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో భారత్ 7000 పాయింట్లతో, 121 రేటింగ్‌తో ద్వితీయ స్థానంలో ఉంది. ఈ దేశాల తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్, యూఏఈ ఉన్నాయి. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానాలలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే ఉన్నాయి.

టెస్ట్ బ్యాట్స్‌మన్లలో తొలిస్థానంలో ఇంకా కోహ్లీ కొనసాగుతున్నారు. ఆయన తర్వాతి స్థానాలలో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జాయ్ రూట్ (ఇంగ్లాండ్), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) కొనసాగుతున్నారు. టెస్టు బౌలర్లలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ ఆండర్సన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), మహ్మద్ అబ్బాస్ (పాకిస్తాన్), వెర్నన్ ఫిలండర్ (దక్షిణాఫ్రికా), రవీంద్ర జడేజా (భారత్) కొనసాగుతున్నారు. 

Trending News