కోహ్లీకి పాక్‌లోనూ అభిమానులు ఎక్కువే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పాకిస్తాన్‌లోనూ అభిమానులు ఎక్కువేనని తెలుస్తోంది.

Last Updated : Dec 17, 2017, 07:49 AM IST
కోహ్లీకి పాక్‌లోనూ అభిమానులు ఎక్కువే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పాకిస్తాన్‌లోనూ అభిమానులు ఎక్కువేనని తెలుస్తోంది. ఇటీవలే పాకిస్తాన్‌లో గూగుల్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాను విడుదల చేసినప్పుడు... అందులో భారత క్రికెట్ రథసారథి విరాట్ కోహ్లి తొలి స్థానంలో ఉండడం విశేషం. దీనిని బట్టి విరాట్ కోహ్లికి పాకిస్తాన్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉందని అంటున్నారు పలువురు క్రికెట్ అభిమానులు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మరియు బ్యాట్స్‌మన్ అహ్మద్ షెహజాద్ ఉన్నారు.

చిత్రమేమిటంటే.. ఇటీవలే బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న కోహ్లీకి చాలామంది పాకిస్తాన్ క్రికెటర్లు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. ప్రస్తుతం ఐసిసి టాప్ టెన్ బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. 

Trending News