Sachin Tendulkar`s first love video : సచిన్ టెండుల్కర్ ఫస్ట్ లవ్ వీడియో

ప్రేమికుల రోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన ఫస్ట్ లవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సచిన్ షేర్ చేసుకున్న ఫస్ట్ లవ్ వీడియోలో అంజలితో లవ్ స్టోరి లేదు. మరి ఆ వీడియోలో ఉంది ఇంకెవరు అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియోను చూసేయండి.

Last Updated : Feb 14, 2020, 04:09 PM IST
Sachin Tendulkar`s first love video : సచిన్ టెండుల్కర్ ఫస్ట్ లవ్ వీడియో

ప్రేమికుల రోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన ఫస్ట్ లవ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సచిన్ టెండుల్కర్ తన సతీమణి అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ షేర్ చేసుకున్న వీడియో కూడా అంజలితో లవ్ స్టోరీకి సంబంధించిందే అయ్యుంటుందని అనుకున్నారంతా.. కానీ ఆ వీడియో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఎందుకంటే ఆ వీడియోలో అంజలితో లవ్ స్టోరి లేదు!! అలా అయితే ఆ వీడియోలో ఉంది ఇంకెవరు అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియోను చూసేయండి.. సచిన్ టెండుల్కర్ ఫస్ట్ లవ్ ఏంటో మీకే తెలుస్తుంది.

అవును, క్రికెట్‌లో ప్రపంచ దిగ్గజంగా ఎదిగి ప్రపంచ క్రికెట్ ప్రియులచేత 'క్రికెట్‌ గాడ్' అని అనిపించుకున్న సచిన్ టెండుల్కర్‌కి క్రికెట్టే కదా ఫస్ట్ లవ్.. బుడతడిగా ఉన్నప్పుడే బ్యాట్ పట్టుకున్న సచిన్ టెండుల్కర్‌కి క్రికెట్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే తన ఫస్ట్ లవ్ ఇదేనంటూ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. 

Read also : మళ్లీ క్రికెట్ మైదానంలో సచిన్ టెండూల్కర్..

2013లో క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత 2014లో మెరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ తరపున ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో చివరిసారిగా బ్యాట్ పట్టుకున్న సచిన్.. ఆ తర్వాత ఆరేళ్లకు ఆస్ట్రేలియా బుష్ ఫైర్ చారిటీ మ్యాచ్ కోసం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అంతేకాదు... ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్చి 7 ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ జట్ల మధ్య జరగనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మ్యాచ్‌లోనూ బ్రియన్ లారా లాంటి విండీస్ దిగ్గజాన్ని సచిన్ ఎదుర్కోనున్నాడు. సచిన్ రమేష్ తెండుల్కర్‌ను మళ్లీ మళ్లీ మైదానంలో చూడాలనుకునే వారికి ఈ మ్యాచ్ కనుల విందు కానుందంటే అతిశయోక్తి కాదేమో కదా!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News