టీమిండియా కోసం ఓవర్‌లో ఆరుసార్లు డైవ్ చేస్తా : విరాట్ కోహ్లీ

ఇండియా vs వెస్ట్ ఇండీస్ 2వ వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ డైవ్ 

Last Updated : Oct 26, 2018, 03:51 PM IST
టీమిండియా కోసం ఓవర్‌లో ఆరుసార్లు డైవ్ చేస్తా : విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ మరోసారి టీమిండియా పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. ఇటీవల వైజాగ్‌లో విండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 150కిపైగా పరుగులు చేసిన కోహ్లీ.. 150 మార్కుని అందుకునే క్రమంలో ఓ సింగిల్ రన్ తీస్తూ రనౌట్ అవకుండా ఉండటానికి క్రీజులోకి అమాంతం ఫుల్ డైవ్ చేశాడు. వీలైనన్ని పరుగులు చేసి టీమిండియాను గెలిపించాలనే తపన అతడికి ఏ స్థాయిలో ఉందో ఆ డైవ్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. 

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. తాను పనిచేస్తున్నదే దేశం కోసం అయినప్పుడు టీమిండియాను గెలిపించడం తన బాధ్యత. తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నాను. ఇందులో తన గొప్పేం లేదని బదులిచ్చాడు. అంతేకాకుండా టీమిండియా గెలుపు కోసం అవసరమైతే ఓవర్ లో ఆరుసార్లు డైవ్ చేయడానికైనా తాను సిద్ధమేనని చెప్పి జట్టు విజయం పట్ల కోహ్లీ తనకు ఉన్న అంకితభావాన్ని చాటుకున్నాడు.

 

Trending News