Delta variant cases: కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ను నివారించాలంటే 80-90 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ (Herd immunity) పొందడమే ఒక మార్గం అని పరిశోధకులు తెలిపారు.
Coronavirus cases in Andhra pradesh: హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 16 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ బారినపడిన వారిలో గత 24 గంటల్లో 2,412 మంది కోలుకున్నారు.
Delta variant cases rising amid Corona second wave: హైదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా వ్యాపిస్తున్నాయని చెప్పిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. జనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. థర్డ్ వేవ్ గురించి శ్రీనివాస రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ (Corona third wave) రావటం అనేది జనం చేతుల్లోనే ఉందని అన్నారు.
Lav Agarwal about Corona second wave: న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేగని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేలా లేదన్న లవ్ అగర్వాల్.. కరోనా సెకండ్ వేవ్ (COVID second wave) ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టంచేశారు.
Night curfew extended in Andhra pradesh: అమరావతి: కరోనావైరస్ను కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎకె సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Covid vaccines for kids: న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ఓ గుడ్‌న్యూస్ (Good news for parents) చెప్పారు. కొవిడ్ థర్డ్ వేవ్ (Corona third wave) చిన్న పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరికలు వినబడుతున్న ప్రస్తుత తరుణంలో రణ్‌దీప్ గులేరియా చెప్పిన గుడ్ న్యూస్ చిన్నారుల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో శనివారం కొత్తగా 2,174 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 18 మంది కరోనాతో (Corona) చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు చేరుకోగా... కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 13,241 మందికి పెరిగింది.
Corona second wave in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 691 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ర్టంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,721 కి చేరుకుంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా రోజువారీగా ఆరు వందలకు కాస్త అటుఇటుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
India Corona Vaccination: గత నెల రోజులుగా ప్రతిరోజూ దేశంలో 40 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా థర్డ్ వేవ్ త్వరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Covishield COVID-19 vaccine: తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు మరింత మద్దతు పెరుగుతుండటంపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులను ఫ్రాన్స్ దేశంలోకి అనుమతి ఇస్తూ శనివారం నాడు ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sonu Sood bought bunglow in Hyderabad: సోనూ సూద్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ అప్డేట్స్ ప్రకారం బంజారాహిల్స్‌లోని పాష్ లొకాలిటీలో అంతే అందమైన, అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సోనూ సూద్ ఆగస్టులో హైదరాబాద్‌లో తన కొత్త ఇంట్లోకి (Sonu Sood's flat in Hyderabad) షిఫ్ట్ అవుతారని సమాచారం.
ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.
India CoronaVirus Tests : గడిచిన 24 గంటల్లో 19 లక్షల 55 వేల 910 శాంపిల్స్ పరీక్షించగా 38,949 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.
Rishabh Pant tests positive for COVID-19: టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ గత ఎనిమిది రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పంత్‌కు ఏ లక్షణాలు లేవని(Asymptomatic) తెలిపారు.
India Covid-19 cases: దేశంలో కరోనా రికవరీ కేసుల కంటే తాజాగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్-19 మరణాలు తక్కువగా నమోదు కావడం స్వల్ప ఊరటనిస్తోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.
Indian cricketers tested positive for Covid-19 in UK: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా యూకేలో ఉంది. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో ఉన్న జట్టులో ఆటగాళ్లకు జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారించారు.
Anandaiah Medicine Latest News: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధాన్ని ఏపీలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. పలు పరీక్షలు చేసి, నిపుణులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆనందయ్య కరోనా ఔషధానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Sputnik V vaccine production at Serum Institute of India: పూణె: సెప్టెంబర్ నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారు చేయనుంది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ డిమిట్రైవ్ వివరాలు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.