డెల్టా వేరియంట్ కేసులు, కరోనా థర్డ్ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరికలు

Delta variant cases rising amid Corona second wave: హైదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా వ్యాపిస్తున్నాయని చెప్పిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. జనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. థర్డ్ వేవ్ గురించి శ్రీనివాస రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ (Corona third wave) రావటం అనేది జనం చేతుల్లోనే ఉందని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2021, 08:45 AM IST
డెల్టా వేరియంట్ కేసులు, కరోనా థర్డ్ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరికలు

Delta variant cases rising amid Corona second wave: హైదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా వ్యాపిస్తున్నాయని చెప్పిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. జనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని.. డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని శ్రీనివాస రావు తెలిపారు. 

థర్డ్ వేవ్ గురించి శ్రీనివాస రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ (Corona third wave) రావటం అనేది జనం చేతుల్లోనే ఉందని అన్నారు. జనం స్వీయ నియంత్రణ, క్రమశిక్షణతో ఉంటేనే కరోనా థర్డ్ వేవ్ రాకుండా నివారించ వచ్చని సూచించారు. ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నందున.. జనం పండుగలు, వేడుకలు అని గుమిగూడకుండా భౌతిక దూరం పాటించాలని అన్నారు. 

Also read : కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదు: లవ్ అగర్వాల్ హెచ్చరికలు

ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షల వరకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి. వ్యాక్సిన్ 50 శాతం లోపు పూర్తయిన జిల్లాల్లో మొదటి డోస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు వ్యాక్సిన్ (vaccination) తీసుకోవాలని గుర్తుచేస్తూ.. వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయోనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Also read : ఏపీ కరోనా వైరస్ కేసుల్లో గణనీయంగా తగ్గుదల, నైట్ కర్ఫ్యూ రెండు వారాలు పొడిగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News