T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ బీలో ఇండియా, పాకిస్తాన్ జట్లు

ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2021, 07:06 PM IST
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ బీలో ఇండియా, పాకిస్తాన్ జట్లు

ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. అలాంటి చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూప్‌లో.. అంటే గ్రూప్-2లో ఉన్నాయి. 

ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC rankings) ఆధారంగా వరల్డ్ కప్ గ్రూపుల వారీగా ఆయా దేశాల జట్లను డివైడ్ చేశారు. ర్యాంకుల్లో టాప్-8 లో ఉన్న దేశాల జట్లు నేరుగా రెండో రౌండ్‌లో పోటీ పడనుండటంతో ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో చేర్చుతూ ఐసీసీ గ్రూపుల జాబితా విడుదల చేసింది. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లో ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లను, క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పోటీపడిన అనంతరం ఈ జట్లకు రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత లభిస్తుంది. అలా గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 కు చేరతాయి. 

Also read : Covid-19: రిషబ్ పంత్‌కు అండగా నిలిచిన బీసీసీఐ అధ్యక్షుడు Sourav Ganguly

తొలి రౌండ్:
గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా (Sri Lanka, Ireland, Netherlands and Namibia).
గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ (Bangladesh, PNG, Scotland and Oman). 

సెకండ్ రౌండ్ (సూపర్-12):
గ్రూప్-1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో పాటు (West Indies, England, Australia and South Africa) గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్ జట్లు ఉంటాయి. 
గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.

Also read : COVID-19: రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్, Delta Variantను గుర్తించిన వైద్యులు

అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌లో బీసీసీఐ నిర్వహించాల్సిన ఈ టోర్నమెంట్ దేశంలో కరోనావైరస్ (COVID-19) వ్యాప్తి కారణంగా యూఏఇలో నిర్వహించనున్నట్టు ఇటీవలే బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ (BCCI chief Sourav Ganguly) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

Also read : T20 World Cup 2021: Shikhar Dhawan కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ఛాన్స్ : Ajit Agarkar

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News