BRS Working President KTR: అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా రాబోయే మూడు నెలలు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులు మొదలు కార్యకర్త వరకూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ 2001లో పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
నాటి నుంచి నేటి వరకూ జిల్లా ప్రజలను మమేకం చేస్తూ తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా పనిచేస్తుందన్నారు కేటీఆర్. తాజా సర్వేల్లోనూ, అన్ని నివేధికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌కు ఎదురులేదని స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రౌండ్ క్లియర్‌గా ఉందని అన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుందన్నారు.
"ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంతో పాటు జిల్లాను అభివృద్ది పథంలో నడుపుతున్న తీరుకు ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమవుతోంది. కనీస పోటీనిచ్చే పరిస్థితిలో కనుచూపు మేరలో ప్రతిపక్షాలు లేవు. ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో పనిచేసి కీలకమైన రాబోయే మూడు నెలలు పూర్తి స్తాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వ గొప్ప కార్యక్రమాలను వివరించాలి.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడంలో కీలక భూమిక పోషించబోయేది కరీంనగరే.. గ్రౌండ్‌లో బాగా పని చేసి ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయండి.." అని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి