Revanth Reddy on CM KCR: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకొందని.. అందుకే గజ్వేల్ నుంచి కామారెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సవాల్‌ను కేసీఆర్ స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. 12.03 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకున్నారని.. కానీ ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా తీశారని అన్నారు.
కేసీఆర్ ప్రాధాన్యత ఏంటో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ విడుదల చేసిన లిస్ట్ చూశాక రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అర్థమైంది. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లే.. కేసీఆర్‌ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారు. కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది.. కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం మైనారిటీలను అవమానించడమే.. ఈ విషయాన్ని మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారు.
రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. ఆయన గొంతులో భయం మొదలైంది. లక్ష రుణమాఫీ అని చెప్పి 99999 రుణమాఫీ అని లక్కీ నంబర్ చూపారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అంటున్నారు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు మీ తాతలు కట్టారా..? 12500 గ్రామ పంచాయతీలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఆ గ్రామాలకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ కాదా..?
నీ చింతమడకలో బడి కట్టింది.. నీ ఇంటికి కరెంటు ఇచ్చింది కాంగ్రెస్.. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో నిర్మించింది కాంగ్రెస్.. జనసంద్రత ఉన్న జూబ్లీబస్ స్టేషన్, కాచిగూడ, గౌలీగూడా లాంటి చోట్ల కాంగ్రెస్ మెట్రో రైలు వేసింది. భూముల విలువ పెంచుకునేందుకు ఔటర్ చుట్టూ కేసీఆర్ మెట్రో వేస్తున్నారు. పేదలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ మెట్రో వేస్తే.. రియల్ వ్యాపారం కోసం మీరు మెట్రో వేస్తున్నారు.." అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందని సిగ్గు లేకుండా అడుగుతున్నవా..? అంటూ ఫైర్ అయ్యారు. ఇదేనా 80 వేల పుస్తకాలు చదివిన నీ జ్ఞానం అని ప్రశ్నించారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో కేసీఆర్ ప్రత్యక్ష భాగస్వామి అని అన్నారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో, 2011లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది నీవు కాదా..? అని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్‌కు తాను సూటిగా సవాల్ విసురుతున్నానని.. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో లెక్కలతో సహా చర్చకు సిద్ధమన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేయడం కాదని.. ఇక్కడ కేసీఆర్‌ను ప్రశ్నించాలని హితవు పలికారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌పై కమ్యూనిస్టులు పోరాటం చేయాలని అన్నారు.
Also Read: BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
Also Read: Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర.. జగన్ సర్కారుపై బండి సంజయ్ నిప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook