Telangana Assembly Elections: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకుంటూ బిజీగా ఉన్న గులాబీ పార్టీ.. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గనిర్దేశంలో గ్రౌండ్ లెవల్లో నాయకులతో సమావేశాలు నిర్వస్తున్నారు. ఇటీవలె ఉమ్మడి కరీంనగర్ ముఖ్య ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని నాయకులకు సూచించారు. ఇప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను చిత్తు చేసి.. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని కసరత్తు చేస్తోంది.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 90 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అధిక మాసం తర్వాత లిస్ట్ ప్రకటించే ఛాన్స్ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 17 లేదా 19న అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నాయి. ఈ సారి 80 శాతం సిట్టింగులకే ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. 29 స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే 20 శాతం మంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కే అవకాశం లేదు. అయితే సీఎం కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్‌లో చేరగా.. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు లక్ష మెజారిటీ అందించాలని కోరారు. అంటే కేసీఆర్ గజ్వేల్ నుంచే బరిలోనే ఉంటారని హింట్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం రంగంలో దూసుకెళ్లాలని బీఆర్ఎస్ సారథి కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే అందరి కంటే ముందు అభ్యర్థుల జాబితా వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తు ఉండే సూచనలు కనిపిస్తుండడంతో వాళ్లకు రెండో జాబితాలో టికెట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్‌లో కోలహాలం నెలకొంది.
Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!
Also Read: BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి