Pay Revision Commission Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ)తో పాటు మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగులు, పింఛనుదారుల హెల్త్ స్కీమ్‌ను పక్కాగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఉద్యోగులతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.
రెండో పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని.. ఐఆర్‌ను జూలై 1వ తేదీ నుంచి అమలయ్యేలా ప్రకటన చేయాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈహెచ్‌ఎస్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగలు సమస్యల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పీఆర్‌సీ, ఐఆర్‌పై ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిపారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారని.. ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డులపై చర్చించారని చెప్పారు. పీఆర్‌సీతోపాటు ఐఆర్ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఆరోగ్య పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. శుక్ర లేదా శనివారాల్లో వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి
Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook