YS Sharmila About Dalita Bandhu Scheme: తీగల్ గ్రామస్థులు తమకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారని.. అందుకే అక్కడి దళితులకు దళిత బంధు పథకం అమలు అవుతుందో లేదోననే వివరాలు తెలుసుకోవడం గురించి వెళ్ళడానికి ప్రయత్నించాం. కానీపోలీసులు మేము అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వత అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శల జోరు పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Mothkupalli Narsimhulu to join TRS: సీఎం కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి నర్సింహులుకు (Mothkupalli Narsimhulu) ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువే సీఎం కేసీఆర్, మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ మళ్లీ ఒక్కతాటిపైకి రావడానికి దోహదపడింది.
Motkupalli Narsimhulu as Dalita bandhu chairman: హైదరాబాద్: మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే దళిత బంధు చైర్మన్‌గా పగ్గాలు చేపట్టనున్నారా అంటే అవుననే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు మరో మూడు లేదా నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని, ఆ తర్వాత మోత్కుపల్లికి దళిత బంధు కమిటీకి (Dalita Bandhu) చైర్మన్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందనేది ఆ ప్రచారం సారాంశం.
Dalita Bandhu scheme benefits will be given to govt employees in dalits: హుజూరాబాద్: దళిత బంధు పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళితులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Kadiyam Srihari comments on Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై టీఆర్ఎస్ పార్టీ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతే ముందుగా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని కడియం శ్రీహరి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
Etela Rajender demands dalita bandhu scheme for all Dalits in Telangana : హుజురాబాద్: దళిత బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలి అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలు అన్నింటికీ తక్షణమే దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
RS Praveen Kumar's name linked to Narketpalli Tahasildar transfers: ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుని బిఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రవ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకంపైనా (Dalita Bandhu scheme) ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Dalita Bandhu Scheme money will be credited from this date: యాదాద్రి భువనగిరి: వాసాలమర్రి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై కీలక ప్రకటన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం (Alair) పరిధిలో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో రేపటి నుంచే దళిత బంధు పథకం అమలవుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు.
CM KCR speech in Halia meeting: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు హాలియాలో అధికార పార్టీ టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల సభకు హాజరైన సీఎం కేసీఆర్ అక్కడ వారికి పలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ హామీల సమీక్షలో భాగంగానే నేడు హాలియా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ (KCR Halia tour).. హాలియా మునిసిపాలిటీ, నందికొండ మున్సిపాల్టీలకు వరాల జల్లు కురిపించారు.
PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడే దళిత బంధు పథకం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ఈ పిల్ దాఖలైంది.
Peddi Reddy joins TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకంటే ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై (Etala Rajender) బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Dalita Bandhu scheme is good for dalits: Vangapally Srinivas: యాదాద్రి భువనగిరి: దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకం ఒక అద్భుతమైన సంక్షేమ పథకం అని ఎమ్మార్పీఎస్-టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఇకనైనా దళితుల బతుకులు బాగుపడాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాన్ని దళితులం సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని అన్నారు.
Motkupalli Narsimhulu praises CM KCR and Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ఒక దళిత కుటుంబానికి రూ 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు దేశంలోనే లేడని మోత్కుపల్లి నర్సింహులు కితాబిచ్చారు.
CM KCR phone call audio leaked: హైదరాబాద్: ఈటల రాజేందర్ చాలా చిన్నోడు. ఈటల రాజేందర్‌తో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈటల రాజేందర్ గురించి మాట్లాడటం చిన్న విషయం. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి (CM KCR comments on Etela Rajender).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.