Lok Sabha Elections: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సరికొత్త జోష్వచ్చింది. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్నారు. ప్రవీణ్‌కుమార్ చేరికతో గులాబీ దళంలో కొత్త ఉత్సాహం వచ్చింది.
Telangana BSP Primises: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది బీఎస్పీ. అధికారంలోకి వస్తే మహిళా కార్మికులకు, రైతులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందజేస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
RS Praveen Kumar stands in support of Vatte Janaiah Yadav: 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
RS Praveen Kumar to contest from sirpur constituency: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే ఎన్నికల్లో కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సిర్పూర్ - కాగజ్ నగర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామని పేర్కొన్నారు.
Afzal Ansari: బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ పై అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
RS Praveen Kumar to join BSP: హైదరాబాద్: రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని బిఎస్పీ అధినేత్రి మాయావతి (BSP chief Mayawati) ధృవీకరించినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలోకి వస్తే.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని ( UP govt ) చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ( Ujjain ) వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.