ఉపపోరులో బీజేపీ ఓటమికి యోగి చెప్పిన కారణాలు ఇవే

యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి వెనుకున్న కారణాలను యోగి ఆదిత్యనాథ్ తనదైన స్టైల్లోనే విశ్లేషించారు. 

Last Updated : Mar 15, 2018, 10:39 AM IST
ఉపపోరులో బీజేపీ ఓటమికి యోగి చెప్పిన కారణాలు ఇవే

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్.. అది తమ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక కారణమైతే, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలే మరో కారణం అని అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్.. భారతీయ జనతా పార్టీకి వున్న ఓవర్‌కాన్ఫిడెన్స్ పార్టీకి తగిన మూల్యం చెల్లించింది అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఫూల్‌పూర్ లోక్ సభ నుంచి విజయం సాధించిన సమాజ్ వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్‌‌కి, గోరఖ్‌పూర్ నుంచి విజయం సొంతం చేసుకున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిశద్‌లకి సీఎం యోగి ఆదిత్యనాధ్ అభినందనలు తెలిపారు. 

ఉప ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) , బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) రెండూ ఒక్క తాటిపైకొచ్చాయి. ఆ రెండు పార్టీల కూటమి తమపై అంతగా ప్రభావం చూపిస్తుంది అని అనుకోలేదు. కానీ ఆ కూటమిని అంచనా వేయడంలోనే తాము తప్పు చేశాం అని ఇప్పుడు అర్థమైంది. మారిన రాజకీయ సమీకరణలు ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యాయి అని బీజేపీ ఓటమి వెనుకున్న కారణాలను యోగి ఆదిత్యనాథ్ తనదైన స్టైల్లోనే విశ్లేషించారు. 

Trending News