UP Elections: ఎంఐఎంతో పొత్తు విషయంలో మాయావతి ఆగ్రహం..కారణమేంటి

UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2021, 12:06 PM IST
UP Elections: ఎంఐఎంతో పొత్తు విషయంలో మాయావతి ఆగ్రహం..కారణమేంటి

UP Elections: హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఎంఐఎం దృష్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఒంటరిగా బరిలో దిగనుందా లేదా మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోనుందా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో బీఎస్పీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ స్థూలంగా చెప్పాలంటే ఎంఐఎం(AIMIM) పార్టీ. పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ విస్తరణకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్నారు. ఇప్పుడు రానున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారించారు. యూపీలో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి బరిలో దిగుతారనే ప్రచార కధనాలు ప్రసారమవుతున్నాయి.ఈ కథనాలపై ఎంఐఎం స్పందించకపోయినా..బీఎస్పీ(BSP) మాత్రం స్పందించింది.

ఎంఐఎం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీతో పొత్తు ఉంటుందంటూ కథనాలు వస్తున్నాయి. అవి నిరాధారమైన వార్తలే తప్ప నిజం కాదు..ఖండిస్తున్నామంటూ ట్విట్టర్ సాక్షిగా మాయావతి తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌( Uttar pradesh)తో పాటు ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలో దిగుతామని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లో మాత్రం అకాళీదళ్‌తో పొత్తు ఉంటుందన్నారు. ఫేక్ ప్రచారాలు చేసేముందు తమను సంప్రదించాలని..లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎంఐఎంతో పొత్తు అనగానే అంత ఆగ్రహం చెందడం వెనుక కారణమేంటనేది తెలియడం లేదు. మాయావతి అయితే తన వైఖరి స్పష్టం చేశారు మరి అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వైఖరేంటనేది ఇంకా తెలియలేదు. 

Also read: Jammu Airforce Station Bomb Blast: జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబు పేలుళ్ల కలకం, రంగంలోకి దిగిన బలగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News