Who Will Win Nagarkurnool Lok Sabha Election: ఎస్సీ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్ లోక్‌సభలో హోరాహోరీగా పోరు నడిచింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనగా.. బీజేపీ మాత్రం నామమాత్ర పోటీ ఇస్తుందని తెలుస్తోంది.
Jupally Krishna Rao Reacts BRS Leader Sridhar Reddy Murder: కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త హత్య తెలంగాణలో రాజకీయ చిచ్చు రేపింది. తనపై ఆరోపణలు చేసిన కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
KT Rama Rao Reacts Achampet Incident: లోక్‌సభ ఎన్నికల అనంతరం నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఇదే నా మీరు కోరే ప్రేమ దుకాణం అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ ఇలాంటి దాడులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
RS Praveen Kumar Brother RS Prasanna Kumar Joining In Congress Party: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భారీ షాక్ తగలనుంది. ప్రవీణ్ కుమార్ కుటుంబంలో రాజకీయ విబేధాలు ఏర్పడ్డాయి. సొంత తమ్ముడు కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్త కలకలం రేపింది.
KCR Welcomes RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులకు భరోసానిస్తూనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Lok Sabha Elections: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సరికొత్త జోష్వచ్చింది. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్నారు. ప్రవీణ్‌కుమార్ చేరికతో గులాబీ దళంలో కొత్త ఉత్సాహం వచ్చింది.
Loksabha Elections Schedule 2024: తెలంగాణ బీఎస్సీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్న బహుజనుల కోసం పాటుపడుతానని పేర్కొన్నారు.
RS Praveen Kumar stands in support of Vatte Janaiah Yadav: 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
RS Praveen Kumar to contest from sirpur constituency: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే ఎన్నికల్లో కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సిర్పూర్ - కాగజ్ నగర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామని పేర్కొన్నారు.
RS Praveen Kumar Comments on TSPSC paper leaks: తెలంగాణలో సంచలనం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లింక్స్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు టెన్త్ పేపర్ మీద ఉన్న శ్రద్ధ టీఎస్పీఎస్సీ పేపర్ లింక్స్ లో లేదని ఆయన అన్నారు
KCR MUNUGODE MEETING: కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారని మండిపడ్డారు. వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దన్నారు. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమేనని కేసీఆర్
Farm House Operation: ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగ సభకు తనతో పాటు ఫాంహౌజ్ డీల్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సభా వేదికపై ఆ నలుగురు ఎమ్మెల్యేలను జనాలకు పరిచయం చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టి పులి బడ్డలని కొనియాడారు.
RS Praveen Kumar Bahujana Rajyadhikara Yatra: బీఎస్పీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రకు సిద్ధమైన వేళ ఆయన కుటుంబం భావోద్వేగానికి గురైంది.
RS Praveen Kumar's name linked to Narketpalli Tahasildar transfers: ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుని బిఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రవ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకంపైనా (Dalita Bandhu scheme) ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
RS Praveen Kumar to join BSP: హైదరాబాద్: రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని బిఎస్పీ అధినేత్రి మాయావతి (BSP chief Mayawati) ధృవీకరించినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలోకి వస్తే.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కరీంనగర్ కోర్టు (Karimnagar court) ఆదేశాలు ఇచ్చింది.
RS Praveen Kumar's VRS application approved: హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలావుంటే, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా తన స్థానంలో నియమితులైన రొనాల్డ్ రోస్కు (IAS Ronald Rose) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Gurukulam entrance exam 2021 postponed: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (TGCET) వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 30న జరగాల్సి ఉన్న గురుకుల ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (TGCET convener RS Praveen Kumar) తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.