UP Ghazipur MP Afzal Ansari: యూపీకి చెందిన బీఎస్పీ లోక్ సభ ఎంపీ అఫ్జల్ అన్సారీ సభ్యత్వం రద్దు చేయబడింది. కృష్ణానంద్ రాయ్ హత్య కేసు, రుంగ్టా కిడ్నాప్ కేసులకు సంబంధించి 16 ఏళ్ల క్రితం నమోదైన గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కేసులో అఫ్జల్ అన్సారీకి 4 ఏళ్ల శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అతడిపై అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది లోక్ సభ సచివాలయం. ఇది 2023 ఏప్రిల్ 29 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని అర్టికల్ 102(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 కింద ఎంపీ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ప్రస్తుతం అన్సారీ ఘాజీపూర్ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఇదే కేసులో అన్సారీ సోదరుడు ముఖ్తార్ అన్సారీకి కూడా న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
నిబంధనల ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన వారి సభ్యత్వం రద్దు చేయబడుతుంది. అఫ్జల్ కంటే ముందు ఆజం ఖాన్ మరియు అతని కుమారుడు అబ్దుల్లాపై అనర్హత వేటు పడింది. ఇది కాకుండా, 2013 అల్లర్లలో దోషిగా తేలిన బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ పై కూడా రీసెంట్ గా అనర్హత వేటు పడింది.
అఫ్జల్ రాజకీయ జీవితం
2004లో అఫ్జల్ అన్సారీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తర్వాత 2005లో కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2009లో ఎస్పీ నుంచి టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. 2014లో బల్లియా స్థానం నుంచి క్వామీ ఏక్తా దళ్ టికెట్‌పై పోటీ చేసినా మళ్లీ ఓటమి పాలయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబంతో సహా బీఎస్పీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అఫ్జల్ ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి రెండోసారి ఎంపీ అయ్యారు.
Also Read: Karnataka next CM: కర్ణాటకలో బీజేపి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook