బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ల లీక్ వెనుక బండి హాస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పేపర్ల లీక్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
Bandi Sanjay Arrest: కరీంనగర్లో అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్‌కు కారణం చెప్పకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
Warangal CP Ranganath Press meet in SSC Paper Leak Case: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి ప్రశ్న పత్రం లీకైందన్న సంచలన వార్త అటు విద్యార్థులను, ఇటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం అంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులంటూ సెటైర్లు వేశారు. పీఎం మోదీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ భారీ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగ సమస్య కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. కేసీఆర్ మెడలు వంచాలంటే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
Modi @ 20 Years Book Contents: ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన " మోదీ @ 20 ఏళ్లు " పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది.
Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు.
Bandi Sanjay On Rahul Gandhi: కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ అని.. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాతున్నారో ఆయనకే తెలియదన్నారు.
సిట్ విచారణకు తాను హాజరుకావట్లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తనకు నోటీసులు అందలేదని.. ఇంటి వద్ద ఏవో పేపర్లు పడి ఉన్నాయన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌కు ఇవ్వనని చెప్పారు.
Bandi Sanjay About TSPSC Paper Leakage Scam: టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్. ఆయనది నాలుకా? తాటిమట్టా? ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారు అని బండి సంజయ్ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.