Sharmila Phonecall To Bandi Sanjay And Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత సంఘనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం.. ఆమె ఈడీ విచారణకు మూడుసార్లు హాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ ఘటన అధికార బీఆర్ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసిన పనికి మొత్తం ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అధికార పార్టీ నేతలు చెబుతుండగా.. ఈ ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంశం చర్చనీయాంశంగా మారిన సందర్భంలో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలకు ఆమె ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అన్నికలిసి ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్ధామని సూచించారు. కేసీఅర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అన్నారు. అందరూ కలిసి పోరాటం చేయకపోతే.. ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బతకనివ్వడన్నారు.
షర్మిల ప్రతిపాదనపై స్పందించిన బండి సంజయ్.. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపారు. ఈ విషయంపై త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని షర్మిలతో చెప్పారు.
ప్రతిపక్ష నేతలను ఏకతాటిపైకి రావాలంటూ వైఎస్ షర్మిల స్వయంగా ఫోన్ చేసి పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఉప్పు, నిప్పులా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వం పోరాడేందుకు కలిసి వస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడు పార్టీలు కలిసి నిరుద్యోగల సమస్యపై పోరాడితే అది తెలంగాణలో సెన్సేషన్ అవుతుంది. చూడాలి మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో..!
Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila: అరుదైన సంఘటన.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్